- Advertisement -
‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ హీరోయిన్ చాందినీరావును వివాహం చేసుకున్నారు. తిరుమల వేదికగా శనివారం వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకలో హీరో సుహాస్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు. ఇక అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కలర్ ఫొటో’లో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. చివరికి పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
- Advertisement -