Monday, December 23, 2024

‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు..

- Advertisement -
- Advertisement -

Color Photo Movie won National Award

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘కలర్ ఫోటో’ సినిమా ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమా ఆహాలో నేరుగా స్ట్రీమింగ్ అయిందన్న సంగతి తెలిసిందే. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవ్వడంతో ఆహా టీం, కలర్ ఫోటో యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీం అంతా కూడా పాల్గొంది. ఈ కార్యక్రమంలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..‘ ‘కలర్ ఫోటో సినిమాకు అవార్డు రావడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు” అని అన్నారు. దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “నిజాయితీతో సినిమా తీస్తే అందరూ సినిమాను ప్రేమిస్తారని అర్థమైంది. ఆటోవాలా నుంచి ఢిల్లీలో కూర్చున్న జ్యూరీ వాళ్లకు కూడా నచ్చుతుందని అర్థమైంది. ఈ అవార్డు రావడంతో మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎన్, సాయి రాజేష్, సుహాస్, కార్తీక్, చాందినీ చౌదరి, దివ్య పాల్గొన్నారు.

Color Photo Movie won National Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News