Wednesday, January 22, 2025

చర్చకు రా… ద్రోహులెవరో తేల్చుదాం

- Advertisement -
- Advertisement -

తప్పులు మీరు చేసి, నెపం మాపై నెడతారా?

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని, ప్రాజెక్టులపై చర్చించేందుకు శాసన సభ ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దామ ని, రెండు రోజుల పాటు ప్రత్యేకంగా వాటిపై చర్చించేందుకు తాము సిద్ధమని సిఎం రేవంత్ అన్నారు. ప్రాజెక్టులపై చర్చకు వచ్చేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమా అని రేవం త్ ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై రేవంత్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరుఫున తా ను, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతామని బిఆర్‌ఎస్ నుంచి కెసిఆర్, ఆయన అల్లుడు హరీష్ ఎంతసేపై నా మాట్లాడొచ్చ ని మేం అడ్డురామన్నారు.అసలు మైక్ కట్ చేయమన్నా రు. చర్చకు రెండు రోజులు సరిపోకపోతే స మావేశాలు పొడిగిద్దామని రేవంత్ ప్రకటించారు.కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవితలు చర్చకు రావాలని దీంతో తెలంగాణకు ఎవరూ అన్యాయం చే శారో తెలిపోతుందని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశా రు. 60 ఏళ్లలో కంటే, ఈ పది సంవత్సరాల్లోనే కృష్ణానది జలా ల్లో తీవ్ర నష్టం తెలంగాణకు వాటిల్లిందని ఆయన ఆరోపించారు.
కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలి
కెసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలని రేవంత్ ఛాలెంజ్ విసిరారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే నల్లగొండకు పోయి నిరసన తెలపడం కాద నీ, ముందు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రావాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేస్తుందని, తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కెటిఆర్, హరీష్ రావులు తమపై ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రజలను గందరగోళానికి గురిచేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
811 టిఎంసిల నీటిపై కేంద్రం కమిటీ
కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని సి ఎం రేవంత్ గుర్తు చేశారు. ఆ రెండు నదులపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం విధి, విధానాలు విభజన చట్టంలో ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్రం త నను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని గతంలో కెసిఆర్ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. దీని ప్రకారమే కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జ రిగినప్పుడు ప్రాజెక్టులపై కెసిఆర్ పార్లమెంటులో ప్ర శ్నించలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదిలోని 811 టిఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పం చుకోవాలన్న దానిపై కేంద్రం కమిటీ వేసిందని రేవంత్ తెలిపారు. ఎపి 512, తెలంగాణకు 299 టిఎంసీలు ఇ స్తున్నట్లు ప్రతిపాదించారని రేవంత్ వివరించారు. దీని కి కె సిఆర్ ప్రభుత్వం ఒప్పుకుని, సంతకాలు కూడా చేసిందన్నారు. ప్రస్తుతం కృష్ణా నీటిలో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరివాహక ప్రాంతం ఎంతైతే రాష్ట్రంలో ఉంటుందో, ఆ మేరకు రాష్ట్రానికి సాగునీరు ఇవ్వాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. వీటికి వ్యతిరేకంగా కృష్ణా నది నీటి కేటాయింపులు(కెఆర్‌ఎంబి) చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో కెసిఆర్, అధికారులు సంతకం పెట్టారని రేవంత్ తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్‌ను జగన్ ఆక్రమిస్తే కెసిఆర్ ఏమీ చేయలేదు
కెఆర్‌ఎంబి మీటింగ్ మినిట్స్ తప్పుగా రాశారని సిఎం రేవంత్ ఆరోపించారు. మీటింగ్ మినిట్స్ తప్పుగా రాయడంపై జనవరి 27వ తేదీన తెలంగాణ అధికారులు కేం ద్రానికి లేఖ రాశారని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం తాము కొట్లాడుతున్నామన్నారు. కెసిఆర్ జనంలోకి వచ్చేందుకు మొహం చెల్లక మాయమాటలు చెబుతున్నారని సిఎం ఆరోపించారు. నాగార్జున సాగర్ డ్యామ్‌ను జగన్ ఆక్రమిస్తే, కెసిఆర్ చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే జగన్ ఇప్పుడు ప్రాజెక్టులపైకి రావాలిని సవా ల్ విసిరారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టి 800 అడుగుల వద్ద నీటి తరలింపునకు య త్నించారని రేవంత్ తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కెసిఆర్ సహకరించారని సి ఎం రేవంత్ ఆరోపించారు. ఆయన హయాంలోనే ఆ రెం డు ఎత్తిపోతల ప్రాజెక్టులు మొదలయ్యాయని, వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కెసిఆర్ లొంగిపోయారని రే వంత్ పేర్కొన్నారు. పదవులు, కమీషన్లకు కెసిఆర్ లొంగి జల దోపిడీకి సహకరించారని రేవంత్ మండిపడ్డారు.
పదవుల కోసం పెదవులు మూసుకున్నారు..?
ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సిఎం రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో కెసిఆర్ కిలోమీటరు మాత్రమే టన్నెల్ నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఉమ్మడి ఎపిలో ఉన్నప్పటి కంటే ఎక్కువ నిర్లక్ష్యం కెసిఆర్ హయాంలోనే జరిగిందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలపై కూడా కెసిఆర్ నిర్లక్ష్యం వహించారన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి తరలింపునకు కెసిఆర్, హరీశ్‌రావు సహకరించి, పదవుల కోసం పెదవులు మూసుకున్నారని రేవంత్ ఆరోపించారు.
ప్రగతిభవన్‌లోనే జగన్, కెసిఆర్‌ల ఒప్పందం
రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తరలింపునకు ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డి ప్రణాళిక వేశారని రేవంత్ అన్నారు. మే 5, 2020న ఈ ప్రాజెక్ట్ కోసం జీఓ ఇచ్చారని సిఎం రేవంత్ గుర్తు చేశారు. శ్రీశైలం నీళ్లే కాదు బురద కూడా ఎత్తిపోసుకునేలా రోజుకు 8 టిఎంసీలు తరలించేలా జగన్ యత్నించారని సిఎం రేవంత్ ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టిఎంసీలు ఎపికి తరలించడానికి కెసిఆర్ అనుమతి ఇచ్చారన్నారు. సాక్షాత్తూ ప్రగతిభవన్‌లోనే జగన్, కెసిఆర్‌ను కలిసి ఒప్పందం చేసుకున్నారని ఆయన తెలిపారు. జగన్‌తో చీకటి ఒప్పందం మేరకే కెసిఆర్ అప్పట్లో కెఆర్‌ఎంబి భేటీకి వెళ్లలేదని, రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకించలేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎపికి నీటిని ధారాదత్తం చేసింది కెసిఆర్
రాష్ట్రానికి రావాల్సిన నీటిని ఎపికి ధారాదత్తం చేసింది కెసిఆర్ అని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలను కాంగ్రెస్‌పై నెడుతోందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కెటిఆర్, హరీష్ రావులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజన చట్టంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణ, ఇతర అంశాలపై గతంలో కేంద్రం స్పష్టతనిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ ఎంపిగా ఉన్నప్పుడే విభజన చట్టంలో ఆ అంశాలను పొందుపర్చారని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ సూచనే మేరకే అప్పట్లో ఈ చట్టాన్ని రూపొందించారని రేవంత్ తెలిపారు.
ఎపి ప్రభుత్వం రోజుకు 8 టిఎంసీల తరలింపు
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తీసుకెళ్లే సమయంలో రాష్ట్రం, కేంద్రంలో బిఆర్‌ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని, అప్పడు ఎవ్వరూ మాట్లాడలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎపి ప్రభుత్వం రోజుకు 8 టిఎంసీలు తరలించడానికి ప్రయత్నించిందని ఆయన తెలిపారు. అందుకు కెసిఆర్ కూడా అడ్డు చెప్పలేదని రేవంత్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ బ్రదర్స్ దివంగత నేత పిజెఆర్, మర్రి శశిధర్‌రెడ్డిలు మాత్రమే ఈ విషయంలో కొట్లాడారని రేవంత్ గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీటిని తీసుకెళ్లే సమయంలో రాష్ట్రం, కేంద్రంలో బిఆర్‌ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నా అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదన్నారు. జల దొపిడీకి జరగడానికి కారణం కెసిఆర్ అని, అప్పట్లో కెసిఆర్ వైఎస్‌ఆర్, చంద్రబాబుతోనూ కుమ్మక్కయ్యాయరని రేవంత్ ఆరోపించారు.
2015లో అంగీకారం
ప్రస్తుతం దీని వల్ల ఏదైనా నష్టం జరిగితే అందుకు కెసిఆర్ పూర్తి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా 2015లో జరిగిన కెఆర్‌ఎంబి భేటీలో తెలంగాణకు 299 టిఎంసీల నీళ్లు చాలని కెసిఆర్ అంగీకరించారని రేవంత్ ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగిస్తామంటూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. 2019 తరువాత కెసిఆర్ దగ్గరే ఇరిగేషన్ శాఖ ఉందని, అప్పటి నుంచి ఆ రకంగానే నీటి కేటాయింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించి నిర్వహణ ఖర్చును కూడా కేటాయించారని, తెలంగాణ రావాల్సిన నీటిని ఎపికి ధారాదత్తం చేసిన వ్యక్తి కెసిఆర్ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. ఇప్పడు ప్రజల మందుకొచ్చి కెటిఆర్, హరీశ్‌రావులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుగా ఉందన్నారు.
కెసిఆర్ సర్వనాశనం చేశారు : ఉత్తమ్
తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను కెసిఆర్ సర్వనాశనం చేశారని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బోర్డు ప్రాజెక్టుల అప్పగింత పై తమ ప్రమేయం లేదని, బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించబోమని ఆయన పేర్కొన్నారు. రెండు టింఎంసీల కోసమే కెసిఆర్ కాళేశ్వరం కట్టారని ఆయన ఆరోపించారు. రూ.95 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలిపోయే ప్రమాదం ఉందని ఆయన వి మర్శించారు. వేల కోట్లు ఖర్చు చేసిన ఎకరాకు నీళ్లియ్య లేదని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసమే కెసిఆర్ హైలెవల్ మీటింగ్‌కు హాజరుకాలేదని ఉత్తమ్ ఆరోపించారు. జగన్ నీళ్లు ఎత్తుకు పోతుంటే కెసిఆర్ ఏకాంత చర్చలో మునిగిపోయారని ఆయన విమర్శించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు కెసిఆర్ అన్యాయం చేశారని ఆయన చెప్పారు.
నీళ్ల దోపిడీకి ముఖ్య కారకుడు కెసిఆర్
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ను పదేళ్లలో కెసిఆర్ ఒక్క కిలోమీటరే తవ్వించారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. కెసిఆర్ తీరుతో తెలంగాణ కృష్ణా నీటి ప్రాజెక్టులు ఎడారిగా మారిందని ఆయన ఆరోపించారు.పాలమూరు రంగారెడ్డికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్వివ్వలేదన్నారు. 27 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టును రూ. 67 వేల కోట్లకు అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News