- Advertisement -
భోపాల్: మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండ్అప్ కమెడియన్ మునావర్ ఫరూకీ జైలు నుంచి విడుదలయ్యాడు. మధ్యప్రేదేశ్ లోని ఇండోర్ జైలులో ఉన్న మునావర్ కు ఈ నెల 5తేదీన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు.భద్రతా కారణాల దృష్ట్యా మునవార్ ను జైలు వెనుక నుంచి పంపినట్టు తెలుస్తోంది. మునావర్ విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇండోర్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదే కేసులో మునావర్ ఫిబ్రవరి 18న ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. జనవరి 1న మునావర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Comedian Munawar released from Indore jail
- Advertisement -