Monday, December 23, 2024

కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం విషమం

- Advertisement -
- Advertisement -

Comedian Raju Srivastava latest Health Update

న్యూఢిల్లీ: ప్రముఖ కమెడియన్-నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని శనివారం వారు తెలిపారు. స్టాండ్ అప్ కమెడియన్‌గా పేరుపొందిన 58 ఏళ్ల రాజు శ్రీవాస్తవకు బుధవారం గుండెపోటు రాగా అదే రోజున ఆయనకు ఎయిమ్స్‌లో ఏంజియోప్లాస్టీ జరిగింది. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ పర్యవేక్షణలో శ్రీవాస్తవకు వైద్య చికిత్స జరుగుతోందని వర్గాలు తెలిపాయి. కాగా..రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజిలో కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News