Wednesday, January 22, 2025

సీఎం రేవంత్, మంత్రులపై కమెడీయన్ సంచలన కామెంట్స్..!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా వివాదం కొనసాగుతోంది. ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే థియేటర్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. థియేటర్కు నటుడు అల్లు అర్జున్ సినిమాను చూసేందుకు వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు అధికంగా రావడంతో అక్కడ భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అభిమాని మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కి ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇకపోతే, శనివారం జరిగిన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై మాట్లాడారు. పుష్ప 2 ప్రీమియర్స్ షో తొక్కిసలాట ఘటన గురుంచి సినీ ఇండస్ట్రీ వాళ్ళు స్పందించలేదని, ఒక నటి, నటుడు కూడా మహిళా కుటుంబాన్ని పరామర్శించలేదని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కి ఏమైంది.. కాలు విరిగిందా..? కన్ను పోయిందా..? కిడ్నీలు పాడైపోయినాయా అని రేవంత్ రెడ్డి అనడంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక కమెడియన్ చేసిన సంచలన వాక్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఓ ప్రోగ్రాం లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సీఎం పాలనలో కరెంటు కోతలు, సమంతపై వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై కమెడియన్ సెటర్లు వేశారు. అంతేకాకుండా.. ఏపీలో అభివృద్ధి ఆగిపోయి ప్రభుత్వాన్ని మార్చితే.. తెలంగాణలో ప్రజలు డెవలప్మెంట్ ఎక్కువై సర్కరణ మార్చాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ అభిమానులు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News