Sunday, December 22, 2024

మహిళతో డేటింగ్ దశలో అమెరికా కెమెడియన్ కిడ్నాప్, హత్య

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటుడు టో గెర్ క్సియాంగ్‌ను కొలంబియాలో కిడ్నాపు చేసి చంపేశారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొలంబియాకు వచ్చిన ఈ కమెడియన్‌ను దుండగులు అపహరించుకువెళ్లారు. రెండువేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. సోమవారం ఈ డిమాండ్‌కు దిగిన కిడ్నాపర్లు, గడువును పట్టించుకోకుండానే ఆయనను చంపేశారని న్యూయార్క్ పోస్టు పత్రిక వార్త వెలువరించింది. 50 సంవత్సరాల ఈ ఆసియన్ అమెరికన్ అమెరికాలోని మిన్నిసోటాలో నివసిస్తున్నారు.

సెలవుపై కొలంబియాకు వెళ్లాడు. ఈ దశలోనే ఈ ఘటన జరిగిందని ఆయన సోదరుడు ఎహ్ క్సియాంగ్ తెలిపారు. ఆయన దారుణ వధను ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. కొలంబియాకు చెందిన ఎల్ కొలంబియానో పత్రిక కూడా ఈ ఘటనను వార్తగా వెలువరించింది. నవంబర్‌లోనే ఆయన కొలంబియాకు చేరారు. అయితే ఓ మహిళతో డేటింగ్‌కు వెళ్లినప్పుడు కిడ్నాప్ అయినట్లు కొలంబియా పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని మహిళను ఉండగా కొందరు మగవారు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు వెల్లడైంది.

ఆ మహిళకు కిడ్నాపర్ల గ్యాంగ్‌కు ఏదైనా సంబంంధం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. కమెడియన్‌ను కిడ్నాప్ చేసిన తరువాత దుండగులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. కోరిన మొత్తం తీసుకుని తాము వెళ్లగా ఆయన మృతదేహం పలు కత్తిపోట్ల గాయాలతో నీళ్లలో పడి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు అని , ఈ విషాదాంతం దారుణమని వెల్లడించారు. కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకునేందుకు ఆయన యత్నించగా దుండగులు చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైతే హత్య జరిగిన గదిలో ఉన్న ఓ మహిళ పారిపోతూ ఉండగా పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News