Sunday, December 22, 2024

కొవిడ్ కష్టంపై కమెడియన్ సెటైర్.. నెటిజన్లు ఫైర్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. కొవిడ్ వివిడ్ బారిన పడిన తమ ఆప్తులకు అవసరమైన ఐసియు పడకల కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం తాము చేసిన ఆర్తనాదాలు ఇంకా ప్రజల మనసుల్లో తడిగానే ఉన్నాయి. డబ్బే పరమావధిగా వ్యవహరించిన ప్రైవేట్ ఆసుపత్రులు, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొవిడ్ రోగిని బతికించడమే లక్షంగా శ్రమించిన ప్రభుత్వ ఆసుపత్రుల ఆరోగ్య రక్షకుల విలువ తెలుసుకున్నదీ కొవిడ్ కాలంలోనే. దేశం కూడా ఆర్థికంగా, ప్రజల ప్రాణాల పరంగా చాలా కోల్పోయింది కొవిడ్ కాలంలోనే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. కొవిడ్ మహమ్మారిపై ఒక స్టాండప్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి కారణం కావడమే. కొవిడ్ కాలంలో ప్రజలు పడ్డ కష్టాలను అపహాస్యం చేస్తూ ఆ కమెడియన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డేనియల్ ఫెర్నాండెజ్ అనే స్టాండప్ కమెడియన్‌కు సంబంధించిన వీడియోను అమిత్ తధాని అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ..ఇతను డాక్టర్ కాదు..కనీసం ఆసుపత్రి నిర్వాహకుడు కూడా కాదు..అంతెందుకు మంచి స్టాండప్ కమెడియన్ కూడా కాదు. డోగి ఎవరికి ఓటు వేశాడో దాని ప్రాతిపదికన వైద్యసహాయం పొందాలన్న ఇతని ఆలోచనా తీరు, దీన్ని హాస్యం పేరుతో అతను చేసిన చవకబారు వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి అంటూ ఫైర్ అయ్యాడు.

ఇంతకీ ఆ వీడియోలో డేనియల్ ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలేంటంటే.. ఆసుపత్రుల్లో పడకలు, ఐసియులు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రజలు తరచు చేసిన విజ్ఞప్తులను డేనియల్ ప్రస్తావిస్తూ..అధికార పార్టీకి ఓటు వేసిన ప్రజలు అటువంటి డిమాండ్లు చేయకూడదు..చాయ్(మోడీకి చెందిన బిజెపికి అని అతని ఉద్దేశం) ఓటు వేశారే తప్ప ఐసియు బెడ్లు, వెంటిలేటర్లకు కాదని డేనియల్ వ్యాఖ్యానించాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో డేనియల్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని వ్యంగ్యాస్త్రాలతో నిందించడాన్ని చూడవచ్చు. ఇప్పటి వరకు 18 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఒక సున్నితమైన అంశంపై ఈ రకంగా అమానుష వ్యాఖ్యలు తగవంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News