Saturday, December 21, 2024

కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్‌ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు యొక్క విశేషమైన ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఇంజనీరింగ్‌లో కెరీర్ ను నిర్మించుకోవాలనుకునే వ్యక్తులకు ఇది ప్రాధాన్యత గమ్యస్థానంగా నిలిచింది. ఉన్నత విద్య పట్ల రాష్ట్రం యొక్క నిబద్ధత, గణనీయమైన నైపుణ్యం కలిగిన నిపుణుల సమూహాన్ని పెంపొందించింది, గణనీయమైన రీతిలో ప్రపంచ డిమాండ్‌ను ఆకర్షించింది.

కర్ణాటకలోని 150కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలు, భారతదేశం అంతటా 50+ ప్రఖ్యాత ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం సంయుక్త పరీక్షగా COMEDK UGET, Uni-GAUGE ప్రవేశ పరీక్ష మే 12, 2024 ఆదివారం జరగనుంది. ఈ ఏకీకృత పరీక్ష కర్ణాటక అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అసోసియేషన్ (KUPECA)తో అనుబంధించబడిన కళాశాలలు, B.E/B.Tech ప్రోగ్రామ్‌లను అందించే Uni-GAUGE సభ్య విశ్వవిద్యాలయాల కోసం రూపొందించబడింది. ఈ ఆన్‌లైన్ పరీక్ష భారతదేశంలోని 200+ నగరాల్లో, 400+ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. ఈ ఏడాది 1,00,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని అంచనా వేస్తోంది. భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుదారులు www.comedk.org లేదా www.unigauge.comలో నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 01, 2024 నుండి ఏప్రిల్ 05, 2024 వరకు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

2022లో, COMED KARES ఇన్నోవేషన్ హబ్‌లను COMEDK పరిచయం చేసింది, నైపుణ్య పెంపుదల కోర్సుల ద్వారా సభ్య సంస్థల నుండి విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కర్నాటక అంతటా ఎనిమిది ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి, వీటిలో నాలుగు బెంగుళూరులో వుండగా మిగిలినవి మైసూరు, కలబురగి, మంగళూరు, బెల్గాంలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అత్యాధునిక కేంద్రాలు, వుడ్ రూటింగ్, లేజర్ కట్టింగ్, 3డి ప్రింటర్లు, AR-VR పరికరాలు, హ్యాండ్ టూల్స్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, UI-UX టూల్స్ వంటి అధునాతన టూల్స్ తో అమర్చబడి ఉన్నాయి. రాపిడ్ ప్రోటోటైపింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)లో ప్రోగ్రామ్‌లను ఈ ఇన్నోవేషన్ హబ్‌లు అందిస్తాయి. COMEDK ప్రారంభించిన ఈ సంచలనాత్మక కార్యక్రమం ద్వారా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు నైపుణ్య ఆధారిత శిక్షణను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక.

“COMEDKలో, విద్యార్థి యొక్క మెరిట్, ఆప్టిట్యూడ్ వారి విద్యా ప్రయాణానికి ఏకైక మార్గదర్శక కారకాలుగా ఉండాలని మేము విశ్వసిస్తున్నాము. మా ప్రవేశ పరీక్ష, COMEDK UGET, పరీక్ష ప్రక్రియలో సరళత, నిష్పాక్షికత పట్ల మా నిబద్ధతకు నిదర్శనం” అని COMEDK ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ కుమార్ తెలిపారు. ”150 కంటే ఎక్కువ అగ్రశ్రేణి కళాశాలలు UGET ద్వారా విద్యార్థులను చేర్చుకుంటాయి. యువ ప్రతిభావంతులతో వారిని కనెక్ట్ చేయడానికి సమానమైన, సమ్మిళిత మరియు దోపిడీ లేని ప్లాట్‌ఫారమ్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాము” అని అన్నారు.

ఎరా ఫౌండేషన్‌ సీఈఓ పి మురళీధర్ మాట్లాడుతూ..“ తమ తదుపరి విద్య ఎక్కడ కొనసాగించాలో ఎంచుకోవడానికి ఏకైక ప్రమాణంగా విద్యార్థి మెరిట్, ఆప్టిట్యూడ్ ఉండాలని మేము గట్టిగా విశ్వసిస్తాము. Uni-GAUGE అనేది పరీక్షా వేదికగా సరళత, నిష్పాక్షికత అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా సూక్ష్మంగా రూపొందించబడింది. రేపటి తరపు ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి మా సహకారం పట్ల మేము గర్విస్తున్నాము’’ అని అన్నారు.

మొత్తం దరఖాస్తు, పరీక్ష ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష మరియు దరఖాస్తు ప్రక్రియపై వివరణాత్మక మార్గదర్శకం www.comedk.org లేదా www.unigauge.comలో విద్యార్థులకు అందుబాటులో ఉంచబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News