Saturday, April 19, 2025

థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే చిత్రం

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-, కామెడీ డ్రామా ’చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ టాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. చౌర్య పాఠం సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. బుధవారం మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ “అంతా కొత్తవారితో సినిమా చేయడం అనేది ఒక సాహసమే.

అలాంటి సాహసం ఈ సినిమాతో చేశాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత అసలు కష్టాలు అర్థం అయ్యాయి. మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. చౌర్య పాఠం అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు.ఒక అవసరం కోసం ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. అది చేస్తున్న సమయంలో ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక టన్నల్ తవ్వి దాని గుండా వెళ్లే క్రమంలో జరిగే కథ ఇది”అని అన్నారు. హీరో ఇంద్రా రామ్ మాట్లాడుతూ “ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కంటెంట్ చాలా బాగుంది”అని తెలిపారు. డైరెక్టర్ నిఖిల్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ఇంద్ర చాలా కష్టపడ్డాడు. థియేటర్స్‌లో సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, రోల్ రీడా, క్రిష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News