ఎల్బీనగర్ : కాంక్రిట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో పార్క్‌లతో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ ప నులకు ఆదివారం మంత్రి ముఖ్యాతిథిగా హజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్వర్యంలో పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఆలోచనలతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని, రాష్ట్రం ఏర్పడక ముందు ఈప్రాంతం ఎట్లుండనే, ఇప్పడు ఎట్లా మారిందే చూడలన్నారు. ఎల్బీనగర్ చౌరస్తా ఫ్లై ఓవర్, అండర్ పాసులతో ఈ ప్రాంత రూపురేఖలు మారయాని, టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంతో ఈప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తెలంగాణ పదేళ్ల పండుగలో ప్రతి ఒక్కరు కృషి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి దయానంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్ శర్మ, నగేష్, కొండల్‌రెడ్డి, పవన్ , సాజిద్ , కాలనీ ప్రతినిధిలు పాల్గొన్నారు.
రూ.32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ పనులకు శ్రీకారం
- Advertisement -
- Advertisement -
- Advertisement -