సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్‌లు, వెబ్ సైట్‌లలో తంబ్ నెయిల్స్ పెట్టి సినిమా ఇండస్ట్రీలోని పలువురిని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి తంబ్ నెయిల్స్, పైరసీలపై యాక్షన్ తీసుకోవాలని నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లను 24 క్రాఫ్ట్ అధ్యక్షులు, కార్యదర్శులు కోరారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ “గతంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. యూట్యూబ్‌లు, వెబ్‌సైట్‌లలో లైక్‌ల కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్ నెయిల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీనిపై త్వరలో యాక్షన్ తీసుకుంటాము”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, జీవిత, మాదాల రవి, వి.యన్. ఆదిత్య, కాశీ, మోహన్ వడ్లపట్ల, ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.