Sunday, December 22, 2024

కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర వరుసగా రెండవ నెల కూడా తగ్గింది. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.150కి పైగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు గమినిస్తే…దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.157.5 తగ్గింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1522.50కి చేరింది. ఆగస్టు నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1680గా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.166.5 తగ్గగా, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.1636కి తగ్గింది. ఆగస్టు నెలలో ధర రూ.1802.50గా ఉంది. ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.158.5 తగ్గగా, ధరలు రూ.1482కి తగ్గాయి. ఆగస్టు నెలలో ధర రూ.1640.50. చెన్నైలోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.157.5 తగ్గగా.. రూ.1695కి తగ్గింది. ఆగస్టులో ధర రూ.1852.50గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News