- Advertisement -
హైదరాబాద్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే 19కిలోల ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.91.50కి తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2028కి తగ్గింది.
తగ్గించిన ధరలను శనివారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించాయి. గృహ అవసరాలకు వినియోగించే డొమిస్టిక్ సిలిండర్ ధర మాత్రం ఎటువంటి మార్పులేకుండా యధాతధంగా ఉంచినట్టు తెలిపాయి.
- Advertisement -