Wednesday, January 22, 2025

వాణిజ్య సిలిండర్ ధరలు పెంపు

- Advertisement -
- Advertisement -

Commercial LPG cylinder prices increased

 

న్యూఢిల్లీ : వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105, 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News