నెలవారీ ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం ధరలు పెంచాయి. ఇవాళ నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే అమల్లోకి తెచ్చాయి. తాజా సవరణ ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1,818.50కి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉన్నాయి. కాగా, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలు కూడా రూ.4 పెరగాయి. అంతకుముందు నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ల ధరను రూ.62 పెంచారు.14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు.
వాణిజ్య సిలిండర్లు ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫ్యాక్టరీలు, కెమికల్ ల్యాబ్‌లు, ఇతర పరిశ్రమలలో ఉపయోగించబడతాయి.ఈ వాణిజ్య సంస్థలు, చిన్న వ్యాపారాలపై ఎక్కువగా ఆధారపడే వారిపై ఈ ధరల సర్దుబాట్లు ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.