Monday, January 20, 2025

పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ధరలు పెంచాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. మంగళవారం 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరను రూ.48.50 పెంచాయి. అక్టోబరు 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపాయి. అలాగే 5-కిలోల ఉచిత వాణిజ్య LPG సిలిండర్ల ధర రూ. 12 పెరిగింది.

తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,740కు చేరుకుంది. ఇంతకుముందు రూ.1,691.50 ఉన్నది. గత సెప్టెంబర్ 1న కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ల ధరను రూ.39 పెంచిన సంగతి తెలిసిందే. కాగా, 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967 ఉండగా.. డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News