Monday, December 23, 2024

విభిన్నమైన కథతో కమర్షియల్ మూవీ

- Advertisement -
- Advertisement -

Commercial movie with different story

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 13న విడుడల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ “విభిన్నమైన కథతో కమర్షియల్ మూవీగా ‘బీస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.

అరబిక్ ట్యూన్‌తో సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన మాస్ పాటకు ఇప్పుడు ప్రపంచమంతా డ్యాన్స్‌లు చేస్తోంది. స్టార్ హీరో విజయ్, పాన్ ఇండియా బ్యూటీ పూజా హెగ్డే క్రేజీ కాంబినేషన్‌లో ‘బీస్ట్’ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంది”అని అన్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ “బీస్ట్ సినిమాతో కోలీవుడ్‌లో నా ప్రయాణం మొదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ మార్క్‌తో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది”అని తెలిపారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ “నా గత చిత్రం ‘డాక్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ‘బీస్ట్’ చిత్రానికి కూడా అదేవిధమైన ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను”అని చెప్పారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News