Saturday, December 21, 2024

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలకు మలక్‌పేట సర్కిల్2 కు చెందిన కమర్షియల్ టాక్స్ అధికారి మహబూబ్ పాషా చిక్కాడు. బుధవా రం నాంపల్లి గగన్ విహార్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి, మహబూబ్ పాషాతో పాటు అదే సర్కిల్‌కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ సోమశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫిర్యాదుదారుడు తన బ్యాంకు ఖాతాను డిఫ్రీజ్ చేసి లెటర్ ఇవ్వడానికి లక్ష రూపాయలు మహబూబ్ పాషా కు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో రూ. 50 వేలు ముందుగా అడ్వాన్స్‌ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని, వారి చిరునామాను గోప్యంగా ఉంచుతామని ఎసిబి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News