(ఎల్. వెంకటేశం)
మనతెలంగాణ/హైదరాబాద్ :కమర్షియల్ ట్యాక్స్‌లో (వాణిజ్య పన్నుల శా ఖ)లో బీహార్ లాబీ పాగా వేసింది. గ తంలో సిఎస్‌గా పనిచేసిన ఓ మాజీ ఐఏఎస్ అన్నీ తానై వ్యవహారించారు. దీం తో తన సొంత లాభం కోసం వినియోగించుకున్న ఓ కన్సల్టెంట్‌కు అప్పనంగా రూ.80 నుంచి రూ. 100 కోట్ల వరకు చెల్లించారు. ఆ కన్సల్టెంట్‌తో వాణిజ్య ప న్నుల శాఖ నుంచి ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే వారికి 5 సంవత్సరా ల్లో ఈ చెల్లింపులను చేయడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ శాఖకు కొత్త కమిషనర్‌గా వచ్చిన శ్రీదేవి (ఐఏఎస్) దీనిని గుర్తించి ఆ కన్సల్టెన్సీ ఉపయోగించిన మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్ చే యడంతోపాటు వారు వినియోగించిన రూమ్‌కు తాళం వేయించారు. దీంతోపాటు 5 సంవత్సరాల్లో ఆ కన్సల్టెన్సీ ఎ లాంటి లావాదేవీలు నిర్వహించింది, అ గ్రిమెంట్ లేకుండా ఈ కన్సల్టెన్సీ నిర్వహించిన విధులను సైతం తెలుసుకునే పనిలో ప్రస్తుత కమిషనర్ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్‌లను, మొబైల్‌ఫోన్‌లను ఫోరోనిక్స్‌కు పంపించాలని కమిషనర్ నిర్ణయించినట్టుగా తె లిసింది. దీంతోపాటు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కమిషనర్ ఫోరోనిక్స్ నివేదిక అనంతరం పూర్తి స్థా యి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టుగా సమాచారం. అయితే ఈ నివేదిక అందిన తరువాత వాణిజ్య పన్నులశాఖకు ఎన్ని కోట్లలో నష్టం వచ్చిందన్న విషయం తేలనుందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ముగ్గురు నమ్మకమైన అధికారులు
బీహార్‌కు చెందిన ఒక ప్రొపెసర్‌తో కమర్షియల్ ట్యాక్స్‌కు సంబంధించి వ్యాపార లావాదేవీలను చూడడానికి ఓ కన్సల్టెన్సీకి మాజీ సిఎస్ బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి అప్పటి సిఎస్ వారితో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోకుండానే సంవత్సరానికి రూ. 10 నుంచి 15 కోట్ల వరకు నిర్వహణ ఖర్చులు, దీంతోపాటు వాహనాలు, టి, టిఫిన్ ఖర్చులను కూడా కమర్షియల్ ట్యాక్స్ చెల్లించేలా మౌఖిక ఆదేశాలను ఆ శాఖ అధికారులకు జారీ చేసినట్టుగా తెలిసింది. అయితే అప్పటి సిఎస్‌కు నమ్మకమైన ముగ్గురు వ్యక్తులకు ఈ బాధ్యతలను అప్పగించగా వారు కూడా ఇదే అదునుగా తాము అందినకాడికి దోచుకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోట్లలో జిఎస్‌టి చెల్లించే వారికి….
అప్పటి సిఎస్ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు 5 సంవత్సరాలుగా ఇప్పటివరకు రూ.80 నుంచి రూ.90 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించినట్టుగా తెలిసింది. అయితే అప్పటి సిఎస్ ఒక బీహార్‌కు చెందిన ప్రొఫెసర్‌కు ఈ బాధ్యతలను అప్పగించగా ఆయన ఐఐటీ వి ద్యార్థులతో ఈ బాధ్యతలను నిర్వర్తించినట్టుగా సమాచారం. అయితే ఐఐటీ విద్యార్థులు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల డేటాను విశ్లేషించి దానికి సంబంధించిన నివేదికను అప్పటి సిఎస్‌కు ఇచ్చినట్టుగా తేలింది. అయితే ఇక్కడే ఒక మతలబు దాగి ఉందని ప్రస్తుతం ఆ శాఖ ఉన్నతాధికారులు చేపట్టిన విచారణలో తేలిం ది. డేటా విశ్లేషణలో భాగంగా కోట్లలో జిఎస్టీ చెల్లించే వ్యాపారుల డేటా ఆధారంగా వారికి మేలు చేసేలా అప్పటి సిఎస్ వ్యవహారించినట్టుగా తేలింది. అయితే కోట్లలో చెల్లించే వ్యాపారులకు మేలు చేసే విధంగా అప్పటి సిఎస్ పావులు కదపడంతో కోట్లలో ముడుపులు కొందరు అధికారులకు, అప్పటి సిఎస్‌కు అందినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తప్పించుకోవడానికి మరో ఇద్దరు ఉన్నతాధికారుల ప్రయత్నం
ఇదిలా ఉండగా అప్పటి సిఎస్‌కు నమ్మకంగా ఉన్న ఈ శాఖలోని ము గ్గురు అధికారులు జిఎస్టీలో దొంగ ట్యాక్స్ ఇన్‌వాయిస్‌లతో ఐటీసిలను రీఫండ్ చేసి పలువురు వ్యాపారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలిసింది. వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులతో పెద్ద ఎత్తున షాపింగ్ భవనాలను ఆ అధికారులు నిర్మించుకున్నట్టుగా తెలిసింది. అయితే జీఎస్టీ రీఫండ్ వీరికి వరంగా మారడంతో అప్పటి సిఎస్ అవలంభించిన విధానాలను వీరు కూడా అమలు చేయడంతో వా రికి కాసులపంట పండినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ ఇద్దరిపై చర్యలు తీసుకోగా మరో ఇద్దరు ఉన్నతాధికారులు అక్కడే తిష్టవేసి మాజీ సిఎస్ చేసిన తప్పిదాలను నుంచి తమను రక్షించుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం.
కమర్షియల్ ట్యాక్స్‌లో కాసుల కనికట్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -