Saturday, December 21, 2024

కాగితాల మీదనే వ్యాపారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు వాణిజ్య పన్నులశాఖ అధికారులు గుర్తించారు. ఈ అనుమానాస్పద జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2,900 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న సంస్థలు, వ్యక్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 2,300 రిజిస్ట్రేషన్‌లను జీఎస్టీ అధికారులు పరిశీలించి వాటికి సంబంధించి సమగ్ర వివరాలను సేకరించారు. అందులో ఇప్పటివరకు 650 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా రూ.1120 కోట్ల ఇన్‌ఫుట్ టాక్స్ క్రెడిట్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. జీఎస్టీ నకిలీ రిజిస్ట్రేషన్లతో భారీ ఎత్తున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్మును దారి మళ్లీంచినట్టుగా అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News