Wednesday, January 15, 2025

కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ శ్రీదేవి బదిలీ

- Advertisement -
- Advertisement -

ఎస్‌సి అభివృద్ధి శాఖకు ట్రాన్స్‌ఫర్ రిజ్వీకి
అదనపు బాధ్యతలు మార్క్‌ఫెడ్ ఎండిగా శ్రీనివాస్‌రెడ్డి
హాకా ఎండిగా చంద్రశేఖర్‌రెడ్డి 
ఎస్.హరీశ్‌కు విపత్తుల నిర్వహణ అదనపు బాధ్యతలు
 రాష్ట్రంలో పలువురు ఐఎస్‌ల బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 1992 బ్యా చ్‌కు చెందిన వికాస్‌రాజ్‌ను ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కే.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. గతంలో ఆ శాఖపై పలు ఆరోపణలు రావడంతో కమిషనర్‌గా ఆమెను తప్పించి ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతం వ్యవహారిస్తున్న రిజ్వీకి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ఇక విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్. హరీశ్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఉదయ్‌కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంకను, హాకా ఎండిగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్‌ఫెడ్ ఎండి గా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News