- Advertisement -
హైదరాబాద్: కమిషన్ కె అంటే కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లు, కాకతీయ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చురకలంటించారు. శాసన సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికి లాబీలోకి వెళ్లి నిరసన తెలపడం సరికాదని ధ్వజమెత్తారు. పదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో ఆది మాట్లాడారు. సభ జరుగుతున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధమని, లాబీల్లో ఫొటోలు తీసిన బిఆర్‌ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై బిఆర్‌ఎస్ సభ్యులు దౌర్జన్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలతోనే బిఆర్‌ఎస్‌ను ప్రజలు అక్కడ కూర్చోబెట్టారని, బిఆర్‌ఎస్ నేత కవిత లిక్కర్ స్కామ్ చేయడంతోనే ఢిల్లీలో ప్రభుత్వం పోయిందని ఎద్దేవా చేశారు. సభలో బిఆర్‌ఎస్ కావాలని హంగామా చేసిందని, కావాలని లాబీల్లోకి వెళ్లి షో చేశారని దుయ్యబట్టారు.
- Advertisement -