Monday, January 20, 2025

అంకుషాపూర్‌ను సందర్శించిన పంచాయతీరాజ్ కమిషనర్

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంత్ రావు గురువారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామంను మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడి, ఎంపిపి ఏనుగు సుదర్శన్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో తడి, చెత్త పొడి చెత్త సేకరణ ఎలా చేపడుతున్నారని, ఇప్పటి వరకు హరితహారం కార్యక్రమాలలో ఇంటింటికి ఎన్ని మొక్కలు పంపిణి చేశారు తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి లింగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పాలకవర్గం అధికారులు కృషి చేయాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సిఈఓ దేవ సహాయం, డిఆర్‌డిఏ అధికారి పద్మజారాణి, డిపిఓ రమణా మూర్తి, ఎంపిడిఓ అరుణ, ఎంపిఓ నందకిషోర్, సర్పంచ్ జలజ సత్యనారాయణ రెడ్డి, ఎంపిటిసి శోభారెడ్డి, ఉపసర్పంచ్ చింతకింది బాలమణి, వార్డు సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News