Monday, December 23, 2024

గ్రూప్4 పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన పోలీసు కమిషనర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో నిజామాబాద్‌లో (78), ఆర్మూర్‌లో (25), బోధన్‌లో (22) నిర్వహిస్తున్న మొత్తం 125 కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్షను ఏర్పాటు చేయగా వాటిని శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా పర్యవేక్షించారు. అన్ని పరీక్ష బందోబస్తులో పాల్గొన్న సిబ్బంది పోలీస్ కమిషనర్, అదనపు డిసిపి (అడ్మిన్, ఎసిపిలు 2, సిఐలు, ఆర్‌ఐలు 19, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు 48, ఎఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ 64, పోలీసు కానిస్టేబుల్స్, హోంగార్డులు 140, మహిళా సిబ్బంది 83, ఇతర విభాగాల సిబ్బంది 48 మంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News