Sunday, January 19, 2025

ఇందిర పార్కు అభివృద్ధికి చర్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇందిర పార్క్ అభివృద్ధి కి ప్రతిపాదించిన పనులను వెంటనే చేపట్టాలని కమిషనర్ రోనాల్డ్ రాస్, యుబిడి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ అభివృద్ధికి ప్రతిపాదించిన వివిధ పనులను కమిషనర్ ఒక్కొకటిగా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పనులన్నింటని యుద్ద ప్రాతిపదిక పూర్తి చేయాలని అడిషనల్ కమిషనర్ వి కృష్ణ ను ఆదేశించారు.

ఇందిరా పార్కు సుందరీకరణ లో భాగంగా వాకర్స్ అసోసియేషన్ ఆసక్తి ఉన్న ప్రతినిధులతో మొత్తం 12 కమిటీ వేసిన నేపథ్యంలో ఆదివారం కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకొని అందులో సాధ్యయే పనులను వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు పార్కు లో ఉన్న స్కేటింగ్ గ్రౌండ్ మరమ్మత్తులు చేయాలని కమిషనర్ ను కోరగా గ్రౌండ్ కు సంబంధించిన నిష్ణాతులతో పరిశీలించిన అనంతరం మరమ్మతులు చేపడుతామన్నారు.

స్కేటింగ్ చూడాటానికి వచ్చే వారి కోసం ఎత్తుగా గ్యాలరీని నిర్మాణానికి దాని క్రింద వాష్ రూం ,టాయ్లెట్. ఇతర వసతుల కోసం అనువైన స్థలం లో నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ యుబిడి , ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగం వారు చేపట్టాల్సిన మొత్తం 23 పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News