కేపీహెచ్‌బి: జీహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్ రోస్ ఆకస్మిక తనిఖీలకు శ్రీకార చుట్టారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లి జోన్‌పరిధిలోని మూసాపేట, కూకట్‌పల్లి సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యనిర్వాహణను పరిశీలించారు. కేపీహెచ్‌బి, కూకట్‌పల్లిలో రోడ్ల పక్కన పేరుకపోయిన వ్యర్థ్ధాలను చూసి స్థానిక అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
అనంతరం ఖైత్లాపూర్ లోని డంపింగ్‌యార్డు ట్రాన్స్‌ఫర్ స్టేషన్, హెచ్‌ఎంటి గ్రౌండ్, కేపీహెచ్‌బీలోని గార్బేజ్ వేస్ట్ ప్లాంట్ సెగ్రిగేషన్ ప్లాంట్లను, మినీ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ స్టేషన్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలుచేశారు. కేపీహెచ్‌బిలో నివాసం ఉండేవారితో కమిషనర్ పారిశుధ్య నిర్వహణ, ఇతర సమస్యలపై మాట్లాడి ఆరాతీశారు. కమిషనర్ ఆ కస్మిక తనిఖీలతో కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ళ జంట సర్కిళ్ళ అధికారు లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వర్షాకాలం అయినందున పారిశుధ్య వ్యర్ధాల తొలగింపు, మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.