Friday, December 20, 2024

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. రాజు ఎవరి సహకారం తీసుకోలేదు:కమిషనర్ శ్వేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి  కేసులో సెన్షేషన్ క్రియేట్ చేయడానికే నిందితుడు రాజు దాడికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చెప్పారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఆమె మీడియాకు వివరించారు. పస్తుతానికి నిందుతుడు రాజు ఎవరి సహకారం తీసుకోలేదని, అతడు ఒక్కడు మాత్రమే నేరంలో పాల్గొన్నట్లు తెలిపారు. రాజు పలు న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్ గా పనిచేస్తున్నాడన్నా రు. వారం క్రితం ప్రణాళిక ప్రకారం నిందితుడు రాజు కత్తిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ దాడిలో ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.

అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరం పల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడని, దీంతో స్థానికులు రాజును కొట్టారని, అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామన్నారు. దర్యాఫ్తు కొనసాగుతోంద న్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాలనే ప్లాన్‌తోనే కత్తి కొనుగోలు చేసి పెట్టుకు న్నట్లు చెప్పారు. నిందితుడు రాజును బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. రాజుకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. రాజును చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News