- Advertisement -
అమరావతి: పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఉ.6 గంటల నుంచే కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. డ్రైన్ల పూడికతీత పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇక నుంచి మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. స్వీపింగ్ మెషిన్లు, యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని, ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని వారికి.. డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
- Advertisement -