Monday, December 23, 2024

జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది ‘కమిటీ కుర్రోళ్ళు’

- Advertisement -
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం శుక్రవారం రాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు యదు వంశీ మీడియాతో మాట్లాడుతూ “మా ఊళ్లో జరిగే జాతరను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులో ప్రతి ఒక్కరి కథ ఉంటుంది. ప్రతి కుర్రాడి కథ ఇందులో కనిపిస్తుంది. స్క్రీన్ మీద సినిమా ఎలా కనిపించాలనేది నిహారిక తెలుసు. దానికి ఏం కావాలో అన్నీ సమకూర్చారు. చెప్పింది చెప్పినట్టుగా తీసే ఫ్రీడం ఇచ్చారు. ఇందులో ప్రతి పాత్ర కూడా హీరోలానే ఉంటుంది.

అందుకే అందరూ కొత్త వాళ్లతోనే ట్రై చేశాను. ప్రసాద్ ఒక్కడే కాస్త తెలిసిన వ్యక్తి. పాత్రకు తగ్గట్టుగానే ఆయన నటించాడు. నాకు ఈ కథ మీద చాలా నమ్మకం ఉంది. రెగ్యులర్ పంథాలో వెళ్లకూడదనే ఉద్దేశంలో ఇలాంటి కథను ఎంచుకున్నాను. 2019లో కొంత రీసెర్చ్ చేశాను. జయప్రకాష్ నారాయణ, పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్లు మాట్లాడిన కొన్ని మాటల స్పూర్తితోనే కొన్ని సీన్లను రాసుకున్నాను. ఫ్రెండ్ షిప్, పొలిటికల్ అంశాలను ఇందులో జొప్పించాను. సాయి కుమార్ వంటి సీనియర్‌తో నటించడం ఆనందంగా ఉంది.

కేరళలో ఉన్నంత అందం కోనసీమలో ఉంది. ఆ అందాన్ని మరింత అందంగా చూపించాం. ఇందులో మదర్ సెంటిమెంట్ అందరినీ కదిలిస్తుంది. థియేటర్లో ఆ సీన్ చూస్తే కంట్లోంచి నీళ్లు వస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ను ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించాను. మన ఊరు.. మన కుర్రోళ్లు.. మన ప్రేమ.. మన భావోద్వేగాలు.. అన్ని రకాల అంశాలతో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమాతో అందిస్తున్నాం. థియేటర్లో కూర్చుంటో నిజంగా జాతరలో ఉండి సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News