Monday, December 23, 2024

ఫ్రెండ్‌షిప్ డే వీక్ కానుకగా కమిటీ కుర్రోళ్ళు

- Advertisement -
- Advertisement -

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యుదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9న విడుదలవుతుంది.

ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ “మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఎక్కువ మంది కొత్త వాళ్లతోనే ఈ సినిమాను పూర్తి చేశాం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ “11 మంది హీరోలు, 4 హీరోయిన్లని పరిచయం చేస్తున్నాం. వారి మధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్ల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలు అన్నింటినీ ఈ చిత్రంలో చూపించబోతున్నాం”అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News