నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యాన ర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శుక్రవారం వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చ టిస్తూ చెప్పిన విశేషాలు…
మూడు తరాల కథ…
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ యదు వంశీ ఈ కథను రాసుకున్నాడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ… పవన్ కళ్యాణ్‌కి అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు.
ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు…
పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతి ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు.
నన్ను పిలిచి అభినందించారు…
మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, విమర్శలు పట్టించుకోను. మా అన్న ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది.
సంగీతం సినిమాకు ప్రాణం…
సినిమాలోని ప్రతి ఒక్క పాత్రకు మంచి సీన్స్ ఉంటాయి. ఇక అనుదీప్ ఇచ్చిన సం గీతం ఈ సినిమాకు ప్రాణం. ఆయన ఈ చి త్రానికి అద్భుతమైన పాటలు, ఆర్‌ఆర్ ఇ చ్చారు. ఈ మూవీకి ఆయనే ప్రధాన బలం.