మన తెలంగాణ/హైదరాబాద్ : మాదిగల వర్గీకరణ కోసం త్వరలో కమిటీ వేస్తామని, మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎస్‌సి ఉప విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మాదిగలకు అ న్యాయం జరిగిందని మేం భావిస్తున్నామని మాదిగల జాతి రత్నం బంగారు లక్ష్మణ్ నే తృత్వంలో నేను పనిచేసి ఓ కార్యకర్తగా ఆ యన నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొ న్నారు. జరుగుతున్న అన్యాయం కలిచివేస్తోందని మందకృష్ణ ఆశయాలకు అనుగుణంగా నేను మీతో కలిసి పనిచేస్తామని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ నిజమైన పోరాట యోధుడని ప్రశంసించారు. ఇంతగా ఆత్మీయత చూపించిన మాదిగ సమాజానికి ధన్యవాదాలు. ఎంతో ప్రేమతో ఈ సభకు నన్ను ఆహ్వానించారని స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలను చూశాను. గత ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి తేడా తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనేది మా విధానం. మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని వన్ లైఫ్, వన్ మిషన్‌లా మందకృష్ణ పోరాటం చేస్తున్నారన్నారు.
దేశంలో పేదరిక నిర్మూలనే మా ప్రధమ ప్రాధాన్యతని మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పి అనేక పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయని ఆ పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చానని ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని, దళిత వర్గాలకు చెందిన రామ్నాథ్ కోవింద్‌ను తాము రాష్ట్రపతిగా చేసిన సమయంలో కాంగ్రెస్ ఆయనను ఓడించే ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందన్నారు. జగ్జీవన్ రామ్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్, తదితరులకు పెద్ద పీట వేశామన్నారు.
కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీని కఠినతరం చేశామని పేదలకు ఎన్నో రకాలుగా అండగా ఉంటున్నామన్నారు. తాము పెట్టిన అనేక పథకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాలే అత్యధిక లబ్ధిదారులన్నారు. ముద్ర లోన్ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన వారిలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మహిళలు ఉన్నారన్నారు. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిగా తాను ఉచిత రేషన్‌ను మరో అయిదేళ్లు పొడిగించినట్లు రైతులను ఆదుకోవడానికి కేంద్రం కొనుగోలు ధరను పెంచుతుందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. బండి సంజయ్, లక్ష్మణ్‌లతో కర్నాటక, మహారాష్ట్రకు చెందిన పలువురు ఎస్సీ నాయకులు హాజరయ్యారు.
ఎస్‌సి వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల
తమ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని గత ఐదేళ్లుగా చెబుతున్నామ ని గత పార్టీలు మాదిగ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి వా రి రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేశారని విమర్శించా రు. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం మందకృష్ణ చేస్తూం టే కాంగ్రెస్ పాలకులు ఆయన పట్టించుకోకుండా ఉద్యమాన్ని చులకగా చూశారని, ఎన్నికల సమయంలో వర్గీకరణ చేస్తామని వేదికలపై హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలో జరిగే ఎన్నికలో బిజెపి అధికారం చేపట్టిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ మందకృష్ణ ఆద్వర్యంలో వర్గీకరణ పోరు విరామం లేకుండా సాగుతుందని, మాదిగలతో ఉపకులాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఎనలేదన్నారు. త్వరలో ఎన్నికల్లో మాదిగలంతా బిజెపి మద్దతు పలికి గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ ఎందుకు కాదో తాము చూపిస్తామని పేర్కొన్నారు.