Thursday, January 23, 2025

జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటీనా?

- Advertisement -
- Advertisement -

కమిటీలో ఉన్న సభ్యులంతా ఉత్తర భారత దేశానికి చెందిన వారే
దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా సభ్యులు లేరు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్

మన తెలంగాణ / హైదరాబాద్ : జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కమిటిలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. అయిదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధాని మోడీ దేశాన్ని గందరగోళ పరిస్థితులోకి నెట్టారని, ఎన్‌డిఏ సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు.

2018లోనే జమిలి ఎన్నికలపై బిఆర్‌ఎస్ అభిప్రాయం చెప్పామని గుర్తు చేశారు. జమిలి ఎన్నికలు మంచిదే కానీ చర్చ జరగాలని లా కమిషన్ కు స్పష్టం చేశారు. మోడీ కి తప్ప బిజెపిలో ఉన్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియడం లేదని జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయ్యి ఉందా ఇప్పుడు వేసిన కమిటీ నామ్ కే వాస్తే కమిటా? అన్న అనుమానం తనకు ఉందన్నారు. మోడీ దేశంను ఎటువైపు తీసుకెళ్తున్నారు అర్థం కావడం లేదని ఏపి విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో శాసన సభలో సభ్యుల సంఖ్య పెంచాలని ఉంది కానీ మోడీ సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఇక చిన్న సవరణతో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ లలో సభ్యుల సంఖ్య పెంచవచ్చని కానీ ఆ విషయంను మోడీ సర్కార్ ఇప్పటి వరకు పెట్టించుకోలేదని మండిపడ్డారు. జమిలి ఎన్నికలకు 5 రాజ్యాంగ సవరణలు అవసరం ఉన్న ముందుకు వెళుతున్నారు కానీ.. విభజన చట్టంలో ఉన్న ఈ అంశంపై మాత్రం ఎందుకు దృష్టి పెట్టలేదని మోడీని ప్రశ్నించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లు విషయంలో పదేళ్లు మోడీ సర్కార్ చేసింది ఏమిటని నిలదీశారు. ఎన్నికల కోసం గందరగోల పరిస్థితి బిజెపి ప్రభుత్వం దేశంలో సృష్టిస్తుందని జమిలి ఎన్నికల అంశం తాజా పరిణామాలపై తమ పార్టీలో చర్చిస్తాంమని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News