Monday, December 23, 2024

వ్యూహం సినిమాపై కమిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమా విడుదల విషయంలో కమిటీ ఏర్నాటు చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఈ కమిటీలో పిటిషనర్, ప్రతివాదులు కలిసి 12 గంటల లోపు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గతంలో ఇలాంటి విషయంలో బాంబే హైకోర్టు కమిటీ వేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటి కమిటీని ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

సదరు కమిటీకి వ్యూహం చిత్రాన్ని చూపించిన అనంతరం రిపోర్ట్ శుక్రవారం లోపు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం విచారణ అనంతరం 12 గంటలకు వాయిదా వేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిడిపి నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. టిడిపి, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యూహం సినిమా తీశారని పిటిషన్‌లో వివరించారు. దీంతో వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News