Thursday, December 19, 2024

రైతుల డిమాండ్ల పరిష్కారానికి త్వరలో కమిటీ: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లను సామరస్యపూర్వకంగా పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు బహుళ సభ్యులతో కూడిన కమిటీని త్వరలోనే ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసిన జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం రైతులకు సంబంధించిన అంశాలను కమిటీకి అందచేయవలసిందిగా పంజాబ్, హర్యనా ప్రభుత్వాలను ఆదేశించింది. ఆగస్టు 12న సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు శంభూ సరిహద్దు వద్ద ందోళన చేస్తున్న రైతులతో తాము చర్చలు జరిపామని, అడ్డగించిన హైవేను పాక్షికంగా తెరవడానికి రైతులు అంగీకరించారని పంజాబ్ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది.

రైతులతో చర్చలు కొనసాగించవలసిందిగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సూచించిన ధర్మాసనం హైవే పైనుంచి ట్రాక్టర్లు, ట్రాలీలను తొలగించడానికి రైతులకు నచ్చచెప్పాలని కోరింది. ఫిబ్రవరి 13 నుంచి రైతులు మకాంవేసి ఆందోళన చేస్తున్న అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశిస్తూ పంజాబ్, హర్యనా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News