Tuesday, November 5, 2024

పార్లమెంటు ఎన్నికల వరకు కమిటీలు ఏర్పాటు చేయాలి: సునీల్ బన్సల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు పాత, కొత్త నేతల కలయికలతో బూత్ కమిటీలు, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేసి పని విభజన చేయాలని విస్తారక్‌లను తెలంగాణ బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ ఆదేశించారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విస్తారకుల సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన బన్సల్ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తంపై దిశా నిర్దేశం చేశారు. డిసెంబరు చివరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై చర్చించారు. అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News