Monday, December 23, 2024

ఎన్నికలలో అక్రమాల నిరోధానికి కమిటీలు : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న ఎన్నికలను మద్యం, డ్రగ్స్, తదితర అక్రమాలను నిరోధించి..పారదర్శకంగా, న్యాయబద్దంగా జరిపేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి ఇంటెలిజెన్స్ కమిటీ, భద్రత, విజిలెన్స్ కమిటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఎన్నికల రిస్క్ అనాలిసిస్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల వేళ నగదు, మద్యం, డ్రగ్స్‌ను అరికట్టేందుకు వ్యూహాలను రూపొందించేందుకు ఈ కమిటీ పనిచేస్తాయన్నారు.ఈ సమావేశానికి పోలీసు విభాగం ఉన్నతాధికారులు మహేష్ భగవత్, అజయ్ రావు కార్తీక్ మాణిక్యం, సునీత, బ్యాంకర్ల ప్రతినిధులు శ్రీహరి, అంకిత్ అగర్వాల్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఓటరు నమోదుపై : హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సహకారంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదును ప్రోత్సహించడానికి వినూత్న పోస్టర్ విడుదల చేసింది.ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఛాలెంజ్‌లో గెలుపొందిన వారికి రూ. 20 వేల బహుమతి అందజేస్తారని తెలిపారు. ఓటరు నమోదుపై విభిన్న ప్రచారాన్ని ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో పోస్టర్, చిన్న వీడియోని తయారు చేయాలని సూచించారు. ఈ నెల 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో htts://tinyurl.com/electioncrea-thon2023లో తమ సృజనాత్మక చిత్రాలను అందజేయవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News