Thursday, January 23, 2025

‘ఉమ్మడి బుల్డోజర్’ సమైక్యానికా!

- Advertisement -
- Advertisement -

ఈ ప్రపంచం సృష్టించడం ద్వారా కానీ, పరిణామం చెందడం ద్వారా కానీ ఏర్పడిందని ఎలా భావించినా, దానికొక స్వభావం మాత్రం ఉందనేది వాస్తవం. ఆ స్వభావం భిన్నత్వమే కానీ, ఏకత్వం కాదు. జీవజాలంలో సారూప్యత కాకుండా, ప్రేమతో మునిగితేలే భిన్నత్వం ఉంటుంది. అది అన్ని జాతుల్లోనూ ఉంటుంది. మానవ జాతి సహా సృష్టిలో ఉన్న జీవజాతులన్నీ కూడా ఆహారాన్ని తింటాయి, విస్తరిస్తాయి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఏ రెండు జీవజాతుల మధ్య ఇవి ఒకే విధంగా ఉండవు. సింహాలు ఏనుగుల్లా తినవు. ‘వెదుర్లు తిని నాలాగా శరీరాన్ని పెంచుకో’ అని ఏ ఏనుగూ సింహాలకు సూచించదు. వెదురులో ఉన్న అద్భుతం ఏనుగుల జాతిని పెంచుతుంది. అంటే ఇదొక అద్భుతం. అన్ని జీవజాతులకు ఈ అద్భుతం వర్తించదు. అన్నీ జీవించే క్రమంలో ఉంటాయి. పక్షులన్నీ కిచకిచలాడతాయి.

ఒక జాతి పక్షులు మాత్రమే ఆ జాతి కిచకిచలను అర్థం చేసుకుంటాయి. వేరే పక్షుల భాషను మాట్లాడమని వాటిపైన ఏఒత్తిడీ లేదు. మనలాగా హిందీ భాష మాట్లాడి తీరాలన్న ఒత్తిడి అసలు రాదు! ఏ రెండు జీవ జాతులూ కలుసుకోవు, తమలాంటి వాటిని సృష్టించవు, ఒకే సమయాన్ని పాటించవు. ‘చాలా గుడ్లు పెట్టు. సంతానాన్ని బాగా పెంచు’ అని వాటికి ఎవరూ చెప్పరు. మనం నివసిస్తున్న ప్రాం తంలో ఉన్న ఈ ప్రపంచం ఎంతో మనోహరంగా రంగురంగులతో, నీడలతో, భిన్నమైన సూర్యోదయాలతో, సూర్యాస్తమయాలతో మేఘమాలల అమరికల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక చెట్టుకు మరొక చెట్టుకు వ్యత్యాసం ఉంటుంది. గబ్బిలమంత పెద్దగా ఉన్నా, సీతాకోక చిలుకలు చాలా భిన్నంగా ఉంటాయి. మతవాదులు తరుచూ చెపుతున్నట్టుగా ఒకే విధంగా ఉండదు, వైవిధ్యంగా ఉండడం ప్రకృతి సూత్రం. భగవంతుడు తనదైన రూపంలో ఉంటాడు’ అని ఒక ఇంగ్లీషు కవి ఈ ప్రపంచానికి పేరు పెట్టాడు.

మానవ సమూహాలు
మానవ సమూహాల్లో కూడా అదే కనిపిస్తుంది. భగవంతుడు తన సొంత ఊహతో ‘మనిషి’ని సృష్టించాడు అనుకుందాం. తొలి సంతానంగా భగవంతుడికి సమీపంగా ఉండేది తెల్లమనిషా, నల్లమనిషా, గోధుమవర్ణం మనిషా, పురుషుడా, మహిళనా అన్నది సందేహమే! భగవంతుడిని ఆరాధించడంలో పురాతత్వ శాస్త్రం లో, తత్వశాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో ఆ పోటీనే గాఢతను సృష్టించింది. భూమిలో, నివాసాల్లో, ప్రసారాల్లో, పోషకాల్లో, వాతావరణంలో విధిగా మన సంస్కృతిని నిర్మించుకోవలసి వచ్చింది. అన్ని విషయాలలోను ఆయా మానవ సమూహాల లోపాలు, బలహీనతలు, అలవాట్లు వారి ప్రత్యేకమైన ఉనికిని చాటుతాయి. ఇటీవల పరిశీలించిందేమిటంటే సంయోగం చెంది న ఏ రెండు కుటుంబాలకు ప్రత్యేకమైన పౌర చట్టాలు లేవు. మనకు తెలిసిన కుటుంబాలలో మర్యాదలు, చిరునామాలు, పోషకాలు, వస్త్రధారణ, చదువుకోవడంలో ఉన్న వ్యక్తిగత అలవాట్లు, నైపుణ్యాలు స్నేహాలు, నిద్రించే, నడిచే స్థిరమైన ప్రాంతా లు, టీ, కాఫీ, పాలు తాగడం వంటివాటిలో మర్యాదలు ఒక పెద్ద కుటుంబంలో అందరికీ ఒకేలా ఉండవు.

ప్రత్యేక అవసరాలు ఉన్న కుటుంబ సభ్యుల గురించి కాకుండా, ఏదో ఒక కుటుంబంలోని సభ్యులందరూ జ్ఞానాన్ని స్వీకరించడంలో ఒకే విధంగా ఆనందాన్ని వ్యక్తం చేయలేరు. నవ భారతంలో ముఖ్యంగా వారసత్వ బాధ్యతను ఎవరైతే ఆమోదించరో అలాంటి వారు కూడా ‘అభివృద్ధి’, ‘జాతీయ ప్రయోజనాలు’ పేరుతో ఆలోచనలను రూపొందించే పాలకుల ఏకీకృత ఆకాంక్షను అప్పుడప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. ఏకీకృతం కోసం ఇచ్చే పిలుపు రాజకీయ జీవితంలో ఫెడరలిజానికి శాపంగా తయారైంది. వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ స్వీయ నిర్బంధమనే జైలుశిక్షకు దారితీస్తుంది. జాతులు, మానవ సమూహాలు ఏకీకృతానికి పిలుపు ఇవ్వడం అనేది ఎల్లవేళలా ‘జాతీయ సామ్యవాద’ పథకం లాంటిది. దీని చరిత్రను అర్థం చేసుకుందాం. నిజమైన జర్మన్లంతా నీలికళ్ళు, అందమైన రాగి జుట్టు తో అర్యులలా ఉంటారనేది హిట్లర్ ఆలోచన. దీంతో నాజీలు జివ్స్‌ను, స్లావాను, రోమాలను తుడిచిపెట్టాలని ఒక భయంకరమైన ప్రయోగాన్ని చేశారు. ఈ రోజు జర్మనీ మాత్రం వలసలను పెద్ద సంఖ్యలో అనుమతిస్తోంది.

భారత దేశంలో చాలా మంది ఏకీకృత పౌరస్మృతిని ప్రతిఘటిస్తున్నారు. సామూహికంగా హిందూ యేతరులందరినీ హిందువులుగా మార్చడానికి చేసే చర్యగా దీన్ని భావిస్తున్నారు. అన్ని మతాలు, సాంస్కృతిక సమూహాలు కలిసి చర్చలు జరిపి, ఒక అభిప్రాయానికి రావడం తప్పేమీ కాదు. అదొక మంచి, హేతుబద్ధమైన చర్యని పలువురు భావిస్తున్నారు. అధికారం తరపున ఇలాంటి చర్చల ప్రక్రియ జరగకపోతే, ఏకీకృత పౌరస్మృతి ఎజెండా కాస్తా ఉమ్మడి పౌరస్మృతికి బదులు హిందూ సాధారణ చట్టంగా తయారవుతుందని అనుమానించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ గణతంత్రంలో హిందూ సమూహంతో పాటు, చిన్న చిన్న అన్ని సమూహాల్లో సంస్కరణలకంటే, వాటి పర్సనల్‌లాను కొనసాగించడం మంచిది. లైంగిక న్యాయాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. వీటన్నిటికీ ‘ఉమ్మడి బుల్డోజర్’ పరిష్కారం కాదు.

సభ్యులందరి మధ్య ఒక సమానత్వాన్ని తీసుకొచ్చే, హేతుబద్ధతను తెచ్చే సమతావాద చట్టం తేవడం కోసం సామాజిక, నైతిక పరిణామంలో మనం ఎక్కడున్నామోనని అన్ని సమూహాలు, మతాలు స్థిరచిత్తంతో ఆలోచించాలి. ఉదాహరణకు, ముస్లిం పర్సనల్ లాను అమలు చేయడంలో ముస్లిం పురుషులు పాలకులుగా ఎందుకు వ్యవహరిస్తుంటారో సమాధానం చెప్పాలి. వివాహ నిర్ణయంలో, నిఖాలో హక్కు ఉన్నప్పటికీ విడాకులలో కూడా సమాన హక్కు ఉండాలి.
ముస్లిం స్త్రీలకు ‘ఖులా’ హక్కు ఉందని తెలివితక్కువగా సమాధానం ఇవ్వడం కాదు.(విడాకులు మంజూరయ్యాక, పెళ్ళి సమయంలో భర్తకు ఇచ్చిన కానుకలను తిరిగి ఇచ్చేయమని ముస్లిం పర్సనల్ లా ప్రకారం స్త్రీలు కోరే హక్కు ‘ఖులా’) విడాకులు తీసుకోవడానికి చర్యలు జరుగుతున్నప్పుడు మతవ్యవస్థలో పురుషుడికే మొదటి అవకాశం లభిస్తోంది. ఏ మతంలోని సంస్కరణలైనా ఆ మతస్థులు చేపట్టడమే మంచిది. ఈసంస్కరణలను వేరే మతస్థులు చేస్తున్నట్టయితే, వారికా హక్కు ఉన్నట్టయితే కచ్చితంగా అది న్యూరోచక్రవర్తి సాధించిన ‘ఉమ్మడి’ లానే ఉంటుంది.

ఉమ్మడి పౌరస్మృతిని ప్రతిపాదించేవారు హేతుబద్ధమైన వాదనలను వినిపించడంలో విఫలమైనప్పుడు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉన్న 44వ అధికరణంలోని ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నించాలని చేసిన సూచనను గుర్తు చేస్తున్నారు. ఈ అధికరణంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలని కానీ, ఏ రూపంలో తీసుకురావాలని కానీ పేర్కొనలేదు. రాజ్యాంగంలో లిఖించిన మరో అధికరణంలో ఉండే ఆదేశిక సూత్రాలలో ఉన్న ఐదు మెట్లలో ఉమ్మడి పౌరస్మృతి ఒక మెట్టు మాత్రమే. 39వ అధికరణంలోని మూడు భాగాలలో ఉన్న నిబంధనలు ఈ సందేహాలను లేవనెత్తుతున్నాయి.
1. ఏ భూమిలో వనరులు ఉన్నాయో, ఆ వనరులు ఆ భూమి కలవారికే తొలుత చెందుతాయి. ఈ రోజున్న ప్రభుత్వం వీటిని గుర్తిస్తుందా? 2. సంపదంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించకుండా అడ్డుపడడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గత తొమ్మిదేళ్ళుగా కొద్ది మంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో సంపదంతా కేంద్రీకరించిన విషయం వాస్తవం కాదా? 3. ఆదాయాల్లో ఉన్న అసమానతలను కనీస స్థాయికి తగ్గించాలి: మోడీ పరిపాలనలో ఉన్నంతగా గతంలో ఎప్పుడూ ఈ అసమానతలు ఇంత దారుణంగా లేవు.

కులం, జాతి, భాష, ప్రాంతం, మతపరంగా పర్సనల్ లాతో సంబంధం లేకుండా అత్యధిక పౌరుల్లో ఆనందాన్ని నింపడానికి, ఏ ప్రభుత్వానికైనా 39వ అధికరణం అమలు అనేది అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలి.39వ అధికరణం అమలు చేయడంలో ఎలాంటి చర్యలైనా సరే ఎందుకు కనిపించడం లేదు? భారతీయులలో అత్యధిక సంఖ్యాకుల జీవిత ప్రమాణాలు ఎందుకు పెరగడం లేదు? అని మనం అడగవచ్చు. పెళ్ళి చేసుకోవడంలో, విడాకులు తీసుకోవడంలో, వారసత్వం అనుభవించడంలో, దత్తత తీసుకోవడం తదితర వాటిల్లో అన్నిట్లో ఒకటే, ఒకే విధంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కూడా సాధ్యమైనంత వరకు అదే స్థాయిలో పాల్గొంటారు. మధ్యప్రదేశ్‌లో ఒక గిరిజన వ్యక్తిపై ఓ ఉన్మాది మూత్రవిసర్జన చేసిన తాజా సంఘటనపై ఏకీకృత పాలకులు మాట్లాడుతూ ఇది గిరిజన తెగల్లో ఉన్న సర్వసాధారణ ఆచారమని సమర్థించ పూనుకుంటున్నారు.అసలు విషయం ఏమిటంటే, త్వరలో శాసన సభకు ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో 30% మంది గిరిజనులు ఉండడం గమనార్హం. ఏ ‘ఉమ్మడి’ అయినా సరే ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తోంది.

అందుకు వారికొక సమస్కారం.ఇతర మతాలకు కూడా ఇలాంటి సౌలభ్యాన్ని ఎందుకు అనుమతించరు? తమ మతంలోనే తాము చేపట్టే సంస్కరణలను చేపట్టాల్సిన అవసరాన్ని ఎందుక గుర్తించరు? ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఉమ్మడి పౌరస్మృతిని ప్రతిపాదించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతరుల లాగే ఈ మతం కూడా దీని కోసం పని చేయాలనేది సుస్పష్టం. ట్రిపుల్ తలాఖ్ అనే భయంకరమైన విధానాన్ని వ్యతిరేకించే క్రమంలో ఆ మతానికి చెందిన వారే కీలక పాత్ర పోషించారు. ఇతరులు కూడా ఇలాంటి సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి పౌరస్మృతి గురించిన హడావిడి వెనుక ఉన్న లక్ష్యం ఏమిటో ఎవరైనా సరే తెలుసుకోలేనంత మూర్ఖులు కాదు. ఇది ముస్లింలను, హిందువులను మరొకసారి విడదీస్తోంది. రానున్న 2024 సాధారణ ఎన్నికల కోసం ఓటు బ్యాంకును భద్రపరచుకోవడానికే. మోడీ రెండవ సారి అధికారం చేపట్టాక గడిచిన నాలుగేళ్ళలో దీని గురించి ఎప్పుడైనా విన్నామా? ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఉమ్మడి పౌరస్మసృతి పేరుతో ప్రజలను ఐక్యం చేయడానికి బదులు విడదీయడానికే ఈ ఉపాయమంతా.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News