Monday, January 20, 2025

భారత్ డబుల్ ధమాకా..

- Advertisement -
- Advertisement -

Commonwealth Games 2022: Vikas in Silver Medal

భారత్ డబుల్ ధమాకా
లాన్ బౌల్స్, టిటిలలో స్వర్ణాలు
వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్‌కు రజతం
బర్మింగ్‌హామ్: ఇక్కడ జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ మరో రెండు స్వర్ణ పతకాలను సాధించింది. అంతేగాక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు రజతం లభించింది. మహిళల లాన్ బౌల్స్ పోటీల్లో భారత్ పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టింది. లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. మరోవైపు పురుషుల టెబుల్ టెన్నిస్ (టిటి) టీమ్ విభాగంలో కూడా భారత్ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అయితే వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో వికాస్ ఠాకూర్ ఓటమి పాలయ్యాడు. వికాస్‌కు రజతం దక్కింది.
లాన్ బౌల్స్‌లో నయా చరిత్ర
మరోవైపు లాన్ బౌల్స్ ఉమెన్స్ ఫోర్స్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత టీమ్ 1710 తేడాతో చారిత్రక విజయం సాధించింది. లాన్ బౌల్స్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. లవ్లీ చౌబే సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో అసాధారణ ప్రతిభను కనబరిచింది. లవ్లీ చౌబే, పింకి, నయన్‌మోనీ, రూపారాణిలతో కూడా టీమ్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీ ఫైనల్లో భారత్ బలమైన న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఇక తుది పోరులో కూడా అసాధారణ ప్రతిభను కనబరిచి పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
లాన్ బౌల్స్ అంటే..
భారత్ పతకం సాధించే వరకు లాన్ బౌల్స్ అనే ఓ క్రీడ ఉందనే విషయం చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి లేదు. ఈ క్రీడకు అంతగా ప్రాచుర్యం. కామన్వెల్త్ క్రీడల్లో దీని తొలిసారి ప్రవేశ పెట్టారు. లాన్స్ బౌల్స్ అనేది ఓ ఔట్ డోర్ క్రీడ. దీన్ని లాన్ బౌలింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆటను 4042 గజాల ఫ్లాట్‌గా ఉండే గ్రీన్‌లాన్‌లో ఆడతారు. ఈ గేమ్‌లోని ప్రధాన లక్షం క్రీడాకారులు తమ బౌల్‌ను జాక్‌కు అతి దగ్గరికి వెళ్లే విధంగా రౌల్ చేస్తూ విసరాల్సి ఉంటుంది. అది వెళ్లి జాక్‌కు అత్యంత సమీపంలో నిలవాలి. అలా ఒక మ్యాచ్ పూర్తవ్వలంటే రు జట్లు 18 మూలల నుంచి బౌల్స్‌ను విసరాలి. ఇక ఈ క్రీడను పూర్తిగా వృత్తాకార పద్ధతిలో నిర్వహిస్తారు. 18 రౌండ్ల తర్వాత ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
టిటి స్వర్ణం మనదే
పురుషుల టెబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 31 తేడాతో సింగపూర్‌ను ఓడించి పసిడి పతకం దక్కించుకుంది. తొలుత జరిగిన పురుషుల డబుల్స్ పోరులో హర్మిత్ దేశాయ్‌సాథియన్ జోడీ విజయం సాధించింది. యంగ్ ఇజాక్‌యో ఎన్ కోన్ జోడీతో జరిగిన పోటీలో భారత జంట 1311, 117, 115 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. అయితే ఆ తర్వాత జరిగిన తొలి సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ ఓటమి పాలయ్యాడు. క్లెరెన్స్‌తో జరిగిన పోరులో శరత్ అనూహ్య ఓటమి పాలయ్యాడు. శరత్ పరాజయంతో భారత్ ఆధిక్యం 11కి తగ్గింది. కానీ తర్వాత జరిగిన రెండో సింగిల్స్ జి సాథియన్ విజయం సాధించాడు. కొన్ పంగ్‌తో జరిగిన పోరులో సాథియన్ 1210, 711, 117, 114 తేడాతో జయభేరి మోగించాడు. ఇక నాలుగో మ్యాచ్ హర్మిత్ దేశాయ్ కూడా జయకేతనం ఎగుర వేశాడు. జెడ్ చ్యూతో జరిగిన పోరులో హర్మిత్ 118, 115, 116 తేడాతో విజయం సాధించాడు. ఈ గెలుపుతో భారత్ 31తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని తన ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని జత చేసుకుంది.
వికాస్‌కు వెండి పతకం
ఇక పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత ఆటగాడు వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల 96 కిలోల విభాగం ఫైనల్లో వికాస్ ఓటమి పాలయ్యాడు. సమోవాకు చెందిన డాన్ ఒపెలోగ్ 381 కిలోల బరువును ఎత్తి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా, భారత ఆటగాడు వికాస్ 346 కిలోల బరువును మోసి రజతం సాధించాడు. స్నాచ్‌లో 155 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 191 కిలోల బరువును వికాస్ ఎత్తాడు. అయితే డాన్ మాత్రం అసాధారణ ప్రతిభతో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు.
జారి పడిన భారత సైక్లిస్ట్ మీనాక్షి
కామన్వెల్త్ భారత సైక్లిస్ట్ మీనాక్షి జారిపడింది. మహిళల 10 కి.మీ. స్క్రాచ్ రేసులో పాల్గొన్న మీనాక్షి జారిపడింది. అయితే మీనాక్షి వెనకాల వస్తున్న న్యూజిలాండ్‌కు చెందిన సైక్లిస్ట్ బోతా ఆమె మీదుగా వెళ్లింది. దీంతో మీనాక్షికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక బోతా కూడా తీవ్రంగా గాయపడింది. గాయం బారిన పడిన ఇద్దరు సైక్లిస్ట్‌లను వైద్యులు శిబిరానికి తరలించారు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇది రెండోసారి. ఇక మీనాక్షి గాయం బారిన పడడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

Commonwealth Games 2022: Vikas in Silver Medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News