Wednesday, January 22, 2025

ముగిసిన కామన్వెల్త్ క్రీడలు

- Advertisement -
- Advertisement -

Commonwealth Games concluded in Birmingham

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. మొత్తం 12 పతకాలతో భారత రెజ్లర్లు మెరిశారు. రెజ్లింగ్ లో భారత్ కు 6 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాల పతకాలు లభించాయి. భారత వెయిట్ లిఫ్టర్లు మొత్తంగా 10 పతకాలు సాధించారు. అందులో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలున్నాయి. టేబుల్ టెన్నిస్ లో భారత్ కు 4 స్వర్ణాలు సహా 7 పతకాలు వచ్చాయి. బాక్సింగ్ లో 3 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ లో 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది భారత్. షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యా పతకాలు ఉన్నాయి. అథ్లెంటిక్స్ విభాగంలో భారత్ కు మొత్తం 8 పతకాలు వచ్చాయి. ఒక స్వర్ణంతో పాటు 4 రజతాలు, 3 కాంస్యాలు నెగ్గిన భారత్ అథ్లెట్లు. లాన్స్ బౌల్స్ క్రీడల్లో భారత్ కు ఒక స్వర్ణం, ఒక రజతం వచ్చాయి. పారా పవర్ లిఫ్టింగ్ లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణం చేరింది. జూడోలో భారత్ కు 2 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 3 పతకాలు వచ్చాయి. హాకీలో ఒక రజతం, ఒక కాంస్యం సహా భారత్ 2 పతకాలు నెగ్గింది. తొలిసారిగి ప్రవేశపెట్టిన క్రికెట్ లో భారత మహిళలకు రజత పతకం లభించింది. స్వ్యాష్ లో భారత ఖాతాలో రెండు కాంస్య పతకాలు చేరాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News