Tuesday, January 21, 2025

కామన్వెల్త్ గేమ్స్: ఫైనల్లో భారత్..

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన సెమీ ఫైనల్లో భారత్ 4 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా రజత పతకం ఖాయం చేసుకుంది. అంతేగాక సెమీస్ గెలుపుతో స్వర్ణ పతకం రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు సోఫియా డంక్లి, డానిల్లి వ్యాట్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన సోఫియా 4 ఫోర్లతో19 పరుగులు చేసింది. మరోవైపు వ్యాట్ ఆరు బౌండరీలతో 35 పరుగులు సాధించింది. అయితే కాప్సె(13) విఫలమైంది. మరోవైపు కెప్టెన్ నటాలి షివర్ కీలక ఇన్నింగ్స్‌తో అలరించింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న షివర్ 41 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఆమి జోన్స్(31) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచింది. కానీ కీలక సమయంలో భారత బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచి పోయింది. దీప్తి శర్మ, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్‌లు అద్భుత బౌలింగ్‌తో భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు.
మంధాన మెరుపులు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్ స్మృతి మంధాన అండగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన స్కోరును పరిగెత్తించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించింది. ఆమెకు మరో ఓపెనర్ షఫాలి వర్మ (15) అండగా నిలిచింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 32 బంతుల్లోనే 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ 44 (నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20), దీప్తి శర్మ (22) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ స్కోరు 164 పరుగులకు చేరుంది.

Commonwealth Games: IND Won by 4 Runs against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News