Monday, December 23, 2024

పాక్ చిత్తు.. భారత్‌కు తొలి గెలుపు

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హమ్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. 100 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది. కీలక మ్యాచులో ఓపెనర్ స్మృతీ మంధాన 63 నా టౌట్ (42 బంతుల్లో 8×4, 3×6) హాఫ్ సెం చరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పో షించింది. పాకిస్తాన్ బౌలర్లలో టుబా హస్స న్, ఓమైమ సోహైల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో కామన్వెల్త్‌లో భారత క్రికెట్ అ మ్మాయిలు తొలి గెలుపును అందుకున్నారు.
చెలరేగిన బౌలర్లు..
వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. పే సర్లు, స్పిన్నర్లు రాణించడంతో పాక్ బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. పాక్ ఓపెనర్ మునీబ్ అలీ 32 (30 బంతుల్లో 3×4, 1×6) మాత్రమే పర్వాలేదనిపించింది. ఇరామ్ జావెద్ (0), బిస్మా మ రూఫ్(17), ఆయేషా నసీమ్ (10), ఒమ మా సొహైల్ (10), అలియా రియాజ్ (18), ఫాతిమా సనా (8), డయానా బైగ్ (0), ట్యూబా హసన్ (1), కైనత్ ఇంతియాజ్ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరా రు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ తలో వికెట్ తీశారు.
భారత్‌కు శుభారంభం
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మహిళలకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (16), స్మృతీ మంధాన పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షెఫాలీ పెవిలియన్ చేరినా.. మంధాన జోరు మాత్రం తగ్గలేదు. ఆమెకు సబ్బినేని మేఘన (14) మంచి సహకారం అందించింది. చివరలో మేఘన ఔట్ అయినా.. జెమీమా రోడ్రిగెజ్ (2 నాటౌట్)తో కలిసి మంధాన మ్యాచ్ ముగించింది. కేవలం 11.4 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసిన హర్మన్ సేన సునాయాస విజయం అందుకుంది.

Commonwealth Games: INDIA Won by 8 Wickets against PAK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News