బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో రతజం లభించింది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్ రజతం సాధించింది. మలేసియాతో జరిగిన ఫైనల్లో భారత్‌కు 13 తేడాతో ఓటమి ఎదురైంది. దీంతో స్వర్ణం సాధిస్తుందని భావించిన భారత్ రజతంతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. ఫైనల్లో పి.వి.సింధు మాత్రమే తన మ్యాచ్‌లో నెగ్గింది. పురుషుల విభాగంలో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమి చవిచూశాడు. అంతేగాక మహిళల డబుల్స, పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు పరాజయం తప్పలేదు. తొలుత జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసింది.
మలేసియాకు చెందిన టెంగ్ ఫాంగ్‌వూకి యుక్ జోడీ 21-18, 21-15 తేడాతో భారత జంటను ఓడించింది. అయితే తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు విజయం సాధించింది. జిన్ వి గోతో జరిగని మ్యాచ్‌లో సింధు 2220, 2117 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో భారత్ స్కోరును 11తో సమం చేసింది. కానీ కీలకమైన పురుషుల సింగిల్స్ స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ అనూహ్య ఓటమి చవిచూశాడు. తనకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనకబడి ఉన్న యంగ్ చేతిలో శ్రీకాంత్ కంగుతిన్నాడు. అసాధారణ ఆటను కనబరిచిన యంగ్ 1921, 216, 2116 తేడాతో శ్రీకాంత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో మలేసియా 21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో ట్రిసా జోలిగాయత్రి గోపీచంద్ కూడా ఓటమి పాలైంది. మలేసియాకు చెందిన కూంగ్‌తినా జంటతో జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ 1821, 1721 తేడాతో కంగుతిన్నది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన మలేసియా 31 తేడాతో భారత్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
Commonwealth Games: India won Silver in Badminton