Tuesday, December 24, 2024

గుజరాత్‌లో మతఘర్షణలు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌లో మతఘర్షణలు జరిగాయి. మాధాపూర్‌లో పాల వ్యాపారం నిర్వహించే యువకుడిని హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. యువకుడి హత్యకు మరో వర్గం కారణమని భావించి ఇంకో వర్గం మసీదులపై దాడికి తెగపడ్డారు. మసీదు పక్కన ఉన్న షాపులపై కూడా దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు చెలరేగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లు నమ్మొద్దని పోలీసులు సూచించారు. రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో ఉండగా మతఘర్షణలు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News