Sunday, December 22, 2024

జోధ్ పూర్ లో మత ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

నిర్బంధంలోకి 50 మంది, ఇద్దరు పోలీసులకు గాయాలు

జోధ్ పూర్: రాజస్థాన్ కు చెందిన జోధ్ పూర్ పోలీసులు శనివారం 51 మందిని మత ఘర్షణలో అరెస్టు చేశారు. సూర్ సాగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల వారి మధ్య మత ఘర్షణలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

పోలీస్ కథనం ప్రకారం రాజారామ్ సర్కిల్ వద్ద ఈద్గా వద్ద రెండు కొత్త  గేట్లు స్థాపించేప్పుడు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ‘‘గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. అయితే శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ఓ 10 నుంచి 15 మంది స్థానికులు వేరే వర్గం వారిపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు మొదలయ్యాయి’’ అని జోధ్ పూర్ పోలీస్ కమిషనర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. గుంపు స్థానిక దుకాణాన్ని తగులబెట్టడం, ఓ పోలీస్ వ్యాన్ సహా రెండు కార్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయని కూడా సింగ్ తెలిపారు.

‘‘ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతున్నారు. దాదాపు 51 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతిని విచ్ఛిన్నం చేసిన అందరినీ అదుపులోకి తీసుకునే దర్యాప్తు జరుగుతోంది. అల్లర్లు ఎలా చెలరేగాయి అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఇరువర్గాల మధ్య ఓ అంగీకారం కుదిరింది’’ అని కమిషనర్ సింగ్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News