Friday, December 20, 2024

మత కలహాలు కాంగ్రెస్ పుణ్యమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుండి పోటీచేయ్ 

రాహుల్‌కు అసదుద్దీన్ సవాల్

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి సవాలు విసిరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశారని ఆయన ఆరోపించారు. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూన్నారు, క్షేత్రస్థాయికి వచ్చి నాపై పోరాడండి’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి ఒవైసి అన్నారు. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించిన విష యం తెలిసిందే కాంగ్రెస్ ఆరోపణలకు ఓవైసి ఘాటుగా సమాధానమిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంను బలపరుచాలని ఒవైసి పిలుపునిచ్చారు. ఎంఐఎంకు ఏడుగురు ఎంఎల్‌ఎలే అంటారని ఆ ఏడుగురు 70 వేల మందితో సమానమని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరు కలిసి శాంతియుతంగా పండుగలు జరుపుకుంటున్నారని అన్నారు. తొమ్మిదేళ్ళలో తెలంగాణ సాధించిందేమిటో, ఇతర రాష్ట్రాలు ఈ తొమ్మిదేళ్ళలో కోల్పోయిందేమిటో ఆలోచించాలన్నారు. ఎంఐఎంను గెలిపించి తెలంగాణను కాపాడుకోవాలని అన్నారు.
పార్లమెంటులో ముస్లింలపై దాడి జరగొచ్చు : ఒవైసి
పార్లమెంటులో ముస్లింపై దాడి జరగొచ్చని ఆ రోజు ఎంతో దూరంలో లేదని అస్దుద్దీన్ ఒవైసి అన్నారు. బిఎస్‌పి, ఎంపి దనీష్ అలీపై లోకసభలో బిజెపి ఎంపి రమేష్ బిదూరి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఒవైసిపై విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా గోవుల స్మగ్లింగ్‌తో పాటు ఇఇతర ఘటనల్లో సామూహిక దాడులు జ్రుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంటు వేదికగా ఓ బిజెపి ఎంపి ముస్లిం ఎంపీని దూషించిన తీరు ప్రజలంతా చూశారని ఆయ్న గుర్తు చేశారు. తన మాటలను గుర్తుంచుకోవాలని పార్లమెంటులో ముస్లిం పై సామూహిక దాడి జరుగుతుందని, ఆ రోజు దగ్గరలోనే ఉందని ఆయనన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికా స్ అని ప్రధాని స్లోగన్ ఇస్తున్నారని ఆ స్లోగన్ ఆచరణలో ఏదని ఆయన ప్రశ్నించారు. ముస్లిం ఎంపీని బెదిరిస్తూ బిజెపి ఎంపీ మాట్లాడిన మాటలను అరబిక్ భాషలో తర్జుమా చేసి యూఎఈకి పంపిస్తారా అని ఆయన మోడిని ప్రశ్నించారు. హర్యానాలో జునైద్, నసీర్ హత్య ల గురించి ప్రధాని మోడి మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్ని, ఎంఐఎం అభ్య్థ్రులు లేని చోట ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ కార్యకర్తలను ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News