Sunday, December 22, 2024

త్యాగశీలి కామ్రేడ్ అనుమాల పార్వతమ్మ

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/ గరిడేపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసురాలు, సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ అనుమాల పార్వతమ్మ ఆశయ సాధనకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామం లో గత రాత్రి అమరులైన కామ్రేడ్ అనుమాల పార్వతమ్మ భౌతికయా న్ని సందర్శించి అరుణ పతకాన్ని అవతనం చేసి పూల మా లలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వీరి మామ గారు మహాత్తర తెలంగాణ సాయుధ పోరాటం లో తుపాకీ పట్టి పేదల పక్షణ పోరాటం చేశారని, స్వాత్రంత్ర ము వచ్చిన తర్వాత పొనుగోడు గ్రామానికి రెండు సార్లు సర్పంచ్ గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి కృషి చేసాడని, తనకున్న యావదాస్తిని మూడు బాగాలుగా చేసి, కొడుకుకు ఒక భాగం, బిడ్డకు ఒక భాగం, పార్టీ కి ఒక భాగం ఇచ్చిన త్యాగాల కుటుంబం వారిదని, మామ గారు చూపిన బాటలోనే తన జీవితం చివరి వరకు ఎర్రజెండా నీడలో కొనసాగి అమరులైన పార్వతమ్మ అందరికి ఆదర్శం ఆయన అన్నారు.

ఈ అంత్యక్రియలలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, హుజుర్నగర్ పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు బిల్లా కనకయ్య, సిపిఐ పొనుగోడు గ్రామ సెక్రటరీ వేశ్యల ఆంజనేయులు, బోధ వీరారెడ్డి, శీలం గుర్నాధం, వారి కుటుంబ సభ్యులు అనుమాల అజయ్ కుమార్, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News