Friday, October 18, 2024

కమ్యూనిస్టులు ఐక్యత సాధించాలి..

- Advertisement -
- Advertisement -

ఫాసిస్టు మతతత్వ ప్రభుత్వం బారి నుండి
ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాలి
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: గతంతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీలు బలహీనమయ్యాయని, అనేక పార్టీలుగా విడిపోయాయని, వాటన్నిటినీ ఐక్యం చేసి దేశంలో ఫాసిస్టు మతతత్వ ప్రభుత్వం బారి నుండి ప్రజా స్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట సేనాని, పార్లమెంటు మాజీ సభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు రావి నారాయణరెడ్డి 30 వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం సభ జరిగింది.

తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రావి నారాయణరెడ్డి ట్రస్టు అధ్యక్షులు సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యాదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ప్రజాపక్షం సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎఐటియుసి నాయకులు ఉజ్జని రత్నాకర్‌రావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రావి నారాయణరెడ్డి మనవరాలు ప్రతిభ తదితరులు హాజరయ్యారు. తొలుత కార్యక్రమానికి హాజరైన వారంతా రావి నారాయణరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాం వ్యతిరేక పోరాటంలో రావి నారాయణరెడ్డి త్యాగాల పోరాటాలకు లక్షలాది మంది ప్రజలు ఉత్తేజితులయ్యారని గుర్తు చేశారు. తొలుత గాంధేయవాదిగా ఉన్న ఆయన హరిజన హాస్టళ్ళను స్థాపించారని, ఖాదీనే ధరించేవారని, సత్యాగ్రహంలో పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్య్రం కోసం మరింత మిలిటెంట్ పోరాటాలు అవసరమని మరింత లోతైన ఆలోచనతో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు ఉద్యమాలలో పాల్గొని నేతృత్వం వహించారని చెప్పారు.

సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో ఒకరైన రావి నారాయణరెడ్డి సరైన సమయంలో దానిని విరమించాలని సూచించారని, పిడివాద ధోరణితో పార్టీ నాయకత్వం అందుకు అంగీకరించలేదని, ఫలితంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలను కోల్పో యారన్నారు. నారాయణ మాట్లాడుతూ నెహ్రూ కంటే అత్యధిక మెజారిటీతో ఎంపిగా గెలుపొందిన రావి నారాయణరెడ్డితో పార్లమెంటు భవనాన్ని పారంభించజేశారని, బహుఝశా అలాంటి చరిత్ర ఉండకూడదనే ఉద్దేశంతోనే మోడీ కొత్త పార్లమెంటు కడుతున్నారేమోనని న్నారు. ఎర్రజెండాలు ఒక్కటే కావాల్సిందేనని, అది ఏదో ఒక రోజు తప్పక జరుగుతుందని అన్నారు. పాశం యాదగిరి మాట్లాడుతూ రావి నారాయణ రెడ్డి ప్రాసంగికత ఇప్పటికీ ఉన్నదని, ఆయనను గుర్తు చేసుకోవడం ద్వారా ఆత్మశుద్ధి అవడంతో పాటు నేడు మన ముందు ఉన్న కర్త వ్యాన్ని గుర్తుకుతెస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ప్రాసంగికత పెరుగుతున్నదని, దేశంలో కమ్యూనిస్టులు విడివిడిగా ప్రయాణం చేస్తే ఉనికి లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి ఐక్యతకు కృషి జరగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News