Monday, December 23, 2024

శాంతి భద్రతల పరిరక్షణకై కమ్యూనిటీ కాంటాక్ట్ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

వనపర్తి  వనపర్తి జిల్లా ఎస్పి రక్షిత కె మూర్తి ఆదేశానుసారం వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ మహేశ్వర్, ఎస్సైలు 8 మంది, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్స్ 11, 39 మంది పోలీస్ కానిస్టేబుల్స్‌తో బుధవారం ఆకస్మికంగా కమ్యూనిటి కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు. కాలనీవాసులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సిఈఐఆర్ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించారు.

నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని, పత్రాలు సరిగ్గా లేని 39 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు అదుపులోకి తీసుకుని వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని అన్నారు. నేరాల నిర్మూలన కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నారు. ప్రజా శాంతికి భంగం కలింగిచే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. కాలనీలలో, స్వీయ రక్షణ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భదత్ర పరమైన అంశాలలో సిసి కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాలు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News